మెదక్, బతుకమ్మ :
మెదక్ జిల్లా కొల్చారం సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి మెదక్ వైపు ప్రయాణిస్తున్న బోధన్ డిపో ఆర్టీసీ బస్సు, ముందు వెళ్తున్న ధాన్యం లారీని ఓవర్ టేక్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలు కాగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారిని మెదక్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
