27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

గోమాతను జాతీయమాతగా ప్రకటించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

భిక్కనూరు, బతుకమ్మ :

 

పార్లమెంటులో చట్టం చేసి గోమాతను జాతీయమాతగా ప్రకటించాలని గోమాత నిర్వాహకులు అన్నారు. గోహత్యలను నిషేధించాలని సోమవారం దేశ వ్యాప్తంగా 5000 పై చిలుకు ఎమ్మార్వో కార్యాల ద్వారా రాష్ట్రపతికి, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రులకు మెమోరండం పంపించడం జరిగిందన్నారు. ప్రస్తుత కాలంలో గోవుల అక్రమ రవాణా విపరీతంగా పెరిగిపోతుందన్నారు. భారతీయ సంస్కృతిని కాపాడడానికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి గోమాతను జాతీయ మాతగా ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తునికి వేణు, లక్ష్మణ్, రాజబాబు గౌడ్, రమేష్, పరమేష్, నరేందర్ రెడ్డి, సంజీవ్, అశోక్ హిందూ సంఘాల కార్యకర్తలు ఉన్నారు.

More articles

Latest article