27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

పాన్ షాప్ లలో పోలీసుల తనిఖీలు

Must read

📰 Generate e-Paper Clip

 

నందిపేట్, బతుకమ్మ

 

నష ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమవారం నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై శ్యామ్ రాజ్ ఆధ్వర్యంలో వారి సిబ్బంది తో కలిసి పాఠశాలల సమీపంలో ఉన్న పాన్ షాపులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీ లో భాగంగా బస్టాండ్, స్కూల్ దగ్గర లో ఉన్న పాన్ షాపులను పరిశీలించగా, మైనర్ లకు టోబాకో ఉత్పత్తులను విక్రయిస్తూ నిబంధనలు ఉల్లంఘించిన షాపు యజమానులపై  కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఎవరైనా ప్రభుత్వ ఆదేశాలకు కట్టుబడి ఉండాలని, లేని యెడల చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయడం జరిగుతుందని హెచ్చరించారు.

 

Police checks at pawn shops

More articles

Latest article