26.2 C
Hyderabad
Monday, August 3, 2026

పోలీస్ అమరవీర కుటుంబానికి చెక్కు పంపిణీ చేసిన రాష్ట్ర డిజిపి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఆర్థిక సహాయం అందించిన టెర్మినస్ గ్రూపు సీ.ఎం.డి ఎస్.పి రెడ్డి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లాలో అక్టోబర్ 18 న మరణించిన సిసిఎస్ పోలీస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ పిల్లల విద్యాభ్యాసానికి ఆర్థిక సహాయం అందించిన టెర్మినస్ గ్రూప్ సీఎండీ ఎస్పీ రెడ్డి ఉదారత ప్రశంసనీయమైంది. శనివారం డీజీపీ కార్యాలయంలో రాష్ట్ర డిజిపి బి.శివధర్ రెడ్డి చేతుల మీదుగా ప్రమోద్ కుమార్ పిల్లలకు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు కోసం చెక్కును అందజేశారు. ఎస్పీ రెడ్డి తండ్రి ఎస్.ఎల్.ఎన్ రెడ్డి బోధన్‌లో డీఎస్పీగా సేవలు అందించారు. ప్రమోద్ కుటుంబానికి సహాయం చేయాలని సంప్రదించగానే, ఎస్పీ రెడ్డి వెంటనే స్పందించి సహకరించడం ఆయన మనసు గొప్పతనాన్ని చూపిస్తుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు అమరవీరులు చేసిన త్యాగాలను ఎప్పటికీ మరచిపోమని, వారి కుటుంబాలకు సాధ్యమైన అన్ని విధాలుగా అండగా నిలుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య పాల్గొన్నారు.

More articles

Latest article