. . . బీజేపీ లో చేరిన రాఘవ్ చద్దా
వెబ్ డెస్క్, బతుకమ్మ :
ఆమ్ ఆద్మీ పార్టీలో తిరుగుబాటు మొదలైంది. ఆప్ రాజ్యసభ సభ్యులైన రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, అశోక్ మిత్తల్ బీజేపీ లో చేరారు. ఆప్ కు మొత్తం 10 మంది రాజ్య సభ సభ్యులు ఉండగా ఏడుగురు పార్టీ మారుతున్నట్టు చద్దా ప్రకటించారు. తమతో పాటు మరో నలుగురు ఆప్ ఎంపీలు హర్భజన్ సింగ్, స్వాతి మాలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రం సహాని కూడా బీజేపీ లో చేరతారని రాఘవ్ చద్దా వెల్లడించారు. ఆప్ రాజ్య సభ పక్షాన్ని బీజేపీ లో విలీనం చేస్తున్నట్టు రాఘవ్ చద్దా ప్రకటించారు. ఇటీవల పార్టీ డిప్యూటి ఫ్లోర్ లీడర్ గా చద్దాను తొలగించడంతో తిరుగుబాటు మొదలైనట్టు తెలుస్తోంది.

