. . . ఆర్థిక శాఖ ఉత్తర్వుల జారీ
హైదరాబాద్, బతుకమ్మ :
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషేదం ఎత్తివేసిన విషయం తెల్సిందే. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ జీవో ఎం.ఎస్.నంబర్.38 ఈ నెల 21న విడుదల చేసింది. అందుకు సంబంధించి బదిలీలు, పోస్టింగ్ ల కోసం గురువారం రాష్ట్ర ఆర్థిక శాఖ షెడ్యూల్ ను విడుదల చేసింది. మే 1న ప్రారంభించి చివరి వరకు ఈ ప్రక్రియను ముగించాలని స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. మే 1 నుంచి 7 వరకు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల వివరాలను ఖచ్చితంగా బదిలీ అయ్యే ఉద్యోగుల జాబితాను ఆయా కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. ఈ నెల 8 నుంచి 15 వరకు బదిలీ కొరకు ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరిస్తారు. మే 16 నుంచి 24 వరకు ప్రభుత్వ ఉద్యోగులు బదిలీ కోసం చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. మే 25 నుంచి 31 వరకు గరిష్టంగా మూడు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి నాలుగో సంవత్సరంలో పని చేస్తున్న వారికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. బదిలీ ఉత్తర్వులు వెలువడిన తర్వాత మూడు రోజుల్లోనే రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి ఆర్థిక శాఖ ఉత్తర్వులను జారీ చేస్తూ ఆర్థిక శాఖ డైరెక్టర్ పార్వతిదేవి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు బదిలీ కాకుండా ఉండేందుకు గాను మూడేళ్ళలోపే పదవి విరమణ చేయాల్సిన వారికి వివిధ అనారోగ్య వైద్య సేవలు పొందుతున్న వారికి మానసిక వికలాంగులు, పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు, భార్యభర్తల కేటగిరిలో 60 శాతం కంటే మించి అంగవైకల్యం ఉన్న వారికి మినహాయింపు కల్పించారు. దాదాపు 8 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో చాలామట్టుకు శాఖల్లో 40 శాతానికి మించి ఉద్యోగులు బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు చాలా మంది పైరవీలతో డిప్యూటేషన్లలో ఉన్న వారు సర్వీసును క్రమబద్దీకరించుకునేందుకు పైరవీలు చేసే అవకాశం లేకపోలేదు. ఈ మేరకు ప్రభుత్వ పెద్దలతో, ఉద్యోగ సంఘాల లీడర్లతో ఇది వరకే టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం.
