బిచ్కుంద, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీ కేంద్రంలో గురువారం సన్ ఫ్లవర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బిచ్కుంద సహకార సంఘం ఆధ్వర్యంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ తో పాటు కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు తమ పంటను తప్పనిసరిగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే విక్రయించాలని సూచించారు. బయట దళారులకు తక్కువ ధరలకు విక్రయించి మోసపోవద్దని, ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో ధాన్యం తూకం, రవాణా సౌకర్యాలు కల్పించాలని సొసైటీ సెక్రటరీ శ్రావణ్ కు సూచించారు. లారీలు సమయానికి అందుబాటులో ఉంచి ధాన్యం తరలింపులో ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు త్వరితగతిన జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ సభ్యులు విట్టల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ధర్పల్ గంగాధర్, ఏఎంసీ వైస్ చైర్మన్ కొంగల శంకర్, డైరెక్టర్లు శివాసెట్ మున్సిపల్ కౌన్సిలర్లు నౌష నాయక్, ముజాహిద్, సందాని, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగనాథ్, వెంకటరెడ్డి, గోపాల్ రెడ్డి, ప్రేమ్ సెట్, ఎం ఏ ఓ అమర్ ప్రసాద్, ఏ ఏం సి సెక్రెటరీ రాజ్ కుమార్, సొసైటీ సెక్రటరీ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
