బిచ్కుందలో సన్ ఫ్లవర్ కొనుగోలు కేంద్రం ప్రారంభం

  బిచ్కుంద, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీ  కేంద్రంలో గురువారం సన్ ఫ్లవర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బిచ్కుంద సహకార సంఘం ఆధ్వర్యంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ తో పాటు కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు తమ పంటను తప్పనిసరిగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే విక్రయించాలని సూచించారు. బయట దళారులకు తక్కువ ధరలకు విక్రయించి మోసపోవద్దని, ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు...