29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

పోలీసు కేసులపై నిజనిర్ధారణ…

Must read

📰 Generate e-Paper Clip

 

. . . అక్రెడిటేషన్ సమస్యలన్నీ పరిష్కరిస్తాం

 

. . . మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మెన్, ఐ జె యు జాతీయ మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డికి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చి తమ సమస్యలను చైర్మెన్ శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియా అకాడమీ చైర్మెన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… నిజామాబాద్, మేడ్చల్ జిల్లాలో జర్నలిస్టులపై జరిగిన అక్రమ కేసులపై నిజనిర్ధారణ కమిటీ వేయడం జరిగిందని అన్నారు.

 

Truth-telling in police cases...

 

ఈ కమిటీ కేసులపై విచారణ చేస్తుందని, ఈ కమిటీ నివేదిక ప్రకారం జర్నలిస్టులకు న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. జర్నలిస్టులకు ఎప్పుడూ యూనియన్ మద్దతు ఉంటుందని అన్నారు. అక్రెడిటేషన్ కార్డుల జారీలో ఉన్న సమస్యలను అన్నిటిని పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇప్పటికే అన్ని సమస్యల పరిష్కారం పూర్తి చేశామని అన్నారు. అలాగే డెస్క్ జర్నలిస్టులు వినతి పత్రం ఇచ్చి తమ సమస్యలను చైర్మెన్ దృష్టికి తెచ్చారు. అలాగే స్మాల్ పేపర్స్ ది. ఎడిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వినతి పత్రం ఇచ్చారు.

 

Truth-telling in police cases...

 

అక్రెడిటేషన్ కార్డుల జారీ, అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడంలో చిన్న పత్రికలకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీనిపై చైర్మెన్ శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. మహిళా జర్నలిస్టులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తమ సమస్యలను తెలియజేశారు. ఈ సందర్భంగా టియుడబ్ల్యుజె – ఐజెయు ప్రతినిధులు చైర్మెన్ శ్రీనివాస్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టి యు డబ్ల్యూ జె – ఐ జె యు జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంజీవ్, ప్రధాన కార్యదర్శి అరవింద్ బాలాజీ, ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దేవీదాసు, కార్యదర్శి శివ ప్రసాద్, డెస్క్ జర్నలిస్టుల కన్వీనర్ భీమ్రావు, నరేందర్ స్వామి, రాకేష్, అశోక్, మహిళా జర్నలిస్టులు సంగీత, అనిత, లావణ్య, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు రాజేష్, జిల్లా కార్యదర్శి ధనుంజయ్, గంగారెడ్డి, హైమద్ అలీ ఖాన్, సాంబన్న, కె 6 శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 

Truth-telling in police cases...

More articles

Latest article