నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నగరంలోని ఆరవ డివిజన్ లో మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ బుధవారం పర్యటించారు. ఆరవ డివిజన్ కార్పొరేటర్ గోపిడి స్రవంతి రెడ్డితో కలిసి నిర్వహించిన ఈ పర్యటనలో డివిజన్ లో కొనసాగుతున్న పలు సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. దీర్ఘకాలంగా పరిష్కారం కానీ సమస్యలను కమిషనర్ ప్రత్యక్షంగా పరిశీలించి వాటిపై సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. డివిజన్ లో పర్యటించాలన్న విన్నపానికి వెంటనే స్పందించినందుకు కమిషనర్ కి, మున్సిపల్ సిబ్బందికి కార్పొరేటర్ కృతజ్ఞతలు తెలిపారు.

