28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

యూనివర్సిటీ వార్షికోత్సవ బ్రోచర్ ఆవిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

 

డిచ్ పల్లి, బతుకమ్మ :

 

తెలంగాణ యూనివర్సిటీలో ఈ నెల 22న నిర్వహించబోయే వార్షికోత్సవ బ్రోచర్ ని వర్సిటీ ఉపకులపతి ఆచార్య టి.యాదగిరిరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్షికోత్సవ కమిటిలన్నీ త్వరితగతిన అన్ని పనులు పూర్తిచేసి నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ వార్షికోత్సవానికి ఎమ్మెల్సీ, ప్రజావాగ్గేయకారుడు గోరటి వెంకన్న ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ కమిటీల కన్వీనర్లు జి.రాంబాబు, కె.లావణ్య, ఆరతి, కె.అపర్ణ, డా.బాలకిషన్, డా.నందిని పాల్గొన్నారు.

More articles

Latest article