29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

మహాత్మ బసవేశ్వర చూపిన మార్గంలో నడవాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . మాజీ ఏఎంసీ చైర్మన్ నాగ్ నాథ్ పటేల్

 

బిచ్కుంద, బతుకమ్మ :

 

సమాజంలో ఉన్న అనేక మూఢాచారాలను పారద్రోలి కుల, మత రహిత సమాజాన్ని నిర్మించడానికి కృషి చేసిన ప్రముఖ సంఘ సంస్కర్త బసవేశ్వర అని మాజీ ఏఎంసీ చైర్మన్ నాగ్ నాథ్ పటేల్ అన్నారు. మహాత్మా బసవేశ్వర జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజం పట్ల అవగాహన కల్పించిన మొదటి గురువు బసవేశ్వరుడు అని, జగత్ గురువుగా వారు చూపిన మార్గంలో నడుస్తూ, ప్రతి ఒక్కరూ పరస్పరం గౌరవించుకుంటూ వారు ఇచ్చిన శాంతి సందేశం పాటించినట్లయితే ఎక్కడ కూడా ఉద్రిక్త వాతావరణం ఉండదన్నారు. బసవేశ్వరుడి జీవిత చరిత్ర ఈ తరానికి తెలవాల్సిన అవసరం ఉందని వారన్నారు.

 

We should follow the path shown by Mahatma Basaveshwara.

 

More articles

Latest article