30.9 C
Hyderabad
Monday, August 3, 2026

మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా బీజేపీ ధర్నా

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కాంగ్రెస్ కూటమి వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ దహనం

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శనివారం మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కూటమి వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు కోణాల గంగారెడ్డి మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ నారీశక్తి వందన్ చట్టం ద్వారా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించారని గుర్తుచేశారు. మహిళలు అన్ని రంగాల్లో పురోగతి సాధించి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టానికి విస్తృత మద్దతు లభించిందన్నారు. అయితే పార్లమెంటులో ఈ బిల్లుకు కాంగ్రెస్ కూటమి ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేయడం మహిళల సాధికారతకు విరుద్ధమని ఆయన విమర్శించారు. మహిళల హక్కులను కాపాడాల్సిన పార్టీలు ఇలాంటి కీలక అంశాల్లో వ్యతిరేకంగా నిలవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా మహిళల అభ్యున్నతికి అడ్డుపడుతున్న వారికి రానున్న ఎన్నికల్లో ఓటుతో తగిన బుద్ధి చెప్పాలన్నారు.

 

BJP dharna against women's reservation bill

 

ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, మహిళల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను అడ్డుకోవడం సమంజసం కాదనన్నారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించడమే నిజమైన అభివృద్ధి మార్గమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు చిదుర సాయిలు, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, బిజెపి మున్సిపల్ కౌన్సిలర్ గజ్జల మహేష్, పాశం ఆమని, భాస్కర్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షులు అనిల్ సిద్ది, బాలరాజ్, రామకృష్ణ, రూరల్ అధ్యక్షులు మజ్జిగ శ్రీనివాస్, మహిళా నాయకులు రేణుక, విజయలక్ష్మి, లక్ష్మి, ఐశ్వర్య, యమునా, సవిత, లావణ్య, సారిక, అంకిత, బిజెపి నాయకులు గుడుగుట్ల శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, చీకట్ల రాజు, చంద్రశేఖర్ గౌడ్, శ్రీకాంత్, నాగరాజు, ప్రదీప్ సింగ్, వెంకట్, భూమేష్, పురుషోత్తం, రాజు, దత్తు, సాయి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article