24 C
Hyderabad
Sunday, August 2, 2026

కాంగ్రెస్ దిష్టిబొమ్మను దహనం చేసిన బిజెపి

Must read

📰 Generate e-Paper Clip

 

. . .  మహిళా బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడింది..

. . . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:

మహిళా బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్ కు భవిష్యత్తు లో మహిళలే తగిన గుణపాఠం చెబుతారని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలో శనివారం నగరంలో నిఖిల్ సాయి చౌరస్తా కాంగ్రెస్ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ… మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడిందన్నారు. 2023 లో ప్రవేశపెట్టిన బిల్లుకు మద్దతు పలికినట్టే పలికి ఇప్పుడు వ్యతిరేకించడం సమంజసం కాదన్నారు. డీఎంకే, సమాజ్ వాదీ పార్టీలు కూడా మహిళల పట్ల వారికున్న నైతికత బయటపడిందన్నారు. మహిళా శక్తి అంటూ చెప్పే కాంగ్రెస్ అవకాశం ఇవ్వాల్సిన సమయంలో వెనక్కి తగ్గిపోవడం సిగ్గుచేటన్నారు. మోడీ అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇలాంటి వ్యతిరేక పనులలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని భవిష్యత్తులో వారికి తగిన గుణపాఠం తప్పదన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఉద్దేశంతో బీజేపీ ముందడుగు వేసింది అన్నారు. 60 ఏళ్లుగా కాంగ్రెస్ చేయని మహిళా బిల్లు ప్రవేశపెడితే ప్రతిపక్షాలు అడ్డుకోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్ కర్ లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు బొబ్బిలి సువర్ణ వేణు, బంటు ప్రీతి ప్రవీణ్, ప్రసూన శ్రీనివాస్ రెడ్డి, మల్లేష్ యాదవ్, మల్కాయి మహేందర్, జ్యోతి మురళి మహిళా నాయకురాలు వనిత తదితరులు పాల్గొన్నారు.

BJP burns Congress effigy
BJP burns Congress effigy

More articles

Latest article