27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఘనంగా సిక్కుల నూతన సంవత్సర బైసాకి పండగ

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

సిక్కుల నూతన సంవత్సరము బైసాకి పండుగను కంటేశ్వర్ లోని ఫతేగడ్ గురుద్వారా లో మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. సిక్కుల పవిత్ర గ్రంథం అయిన గురు గ్రంధ సాహెబ్ ను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుండి సిక్కు సోదరులందరూ ఊరేగింపుగా కంటేశ్వర్ లోని ఫతేగడ్ గురుద్వారా నుండి పంచ్ ప్యారి బయలుదేరి, మధ్యలో కత్తి విన్యాసాలు చేస్తూ, భజన కీర్తనలు చేస్తూ స్థానిక గాజులపేట గురుద్వారా వద్దకు చేరుకున్నారు.

 

Sikh New Year Baisakhi celebrated in grand style

 

ఈ పండగను కల్స పంత్ పండగ అని కూడా అంటారని, గురు గోవింద్ సింగ్ మహారాజ్ మార్చ్ 30 న 1699 లోకల్సా పంత్ ను కేష్ గర్ సాహెబ్, అమృత్ సర్ లో పంచ్ ప్యారేలను తయారుచేసి దేశ సమైక్యత కొరకు, కుల మతాలకు తావు లేకుండా దేశాన్ని ధర్మాన్ని రక్షించుటకై పివివిధ మతాలకు చెందిన ఐదుగురిని అమృతం తాగించి పంచ్ ప్యారేగా నామకరణం చేసి ప్రతి సిక్కు సోదరుడిని సింగ్ గా ప్రకటించారని కృపాల్ సింగ్ సోడి తెలిపారు. ఈ పండుగను పంజాబ్, హర్యానా లో రైతుల పండుగగా జరుపుకుంటారుని, పంటలు బాగా పండి దిగుబడి బాగా రావాలని గురు గ్రంథ సాహెబ్ ను ప్రార్థిస్తారని అన్నారు. ఈ సందర్భంగా కృపాల్ సింగ్ సోడి బైసాఖి సిక్కులందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శన్ సింగ్, గోవింద్ సింగ్, సుఖ్వీందర్ సింగ్, సోహన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

 

Sikh New Year Baisakhi celebrated in grand style

More articles

Latest article