25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

వేసవి కాలంలో చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . మరిన్ని రక్త దాన శిబిరాలను ఏర్పాటు చేయాలి

 

. . . కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

తల సేమియా వ్యాధితో బాధపడే చిన్నారులు వేసవికాలంలో రక్తం దొరకక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వారికోసం మరిన్ని రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కర్షక్ బి.ఎడ్ కళాశాలలో భారత రాజ్యాంగ రూపశిల్పి మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మంగళవారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్), ఎస్సీ, ఎస్టీ జిల్లా ఉపాధ్యాయ సంఘం సంయుక్తంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయుల జయంతి సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం, ప్రభుత్వ వైద్యశాలలోని చికిత్స పొందుతున్న వారి కోసం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు, రక్తదానం చేసిన వారికి హెల్మెట్ లను అందజేసిన కామారెడ్డి రక్తదాతల సమూహము, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్,ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘాలను అభినందించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఐవిఎఫ్ సెంట్రల్ అడ్వైజర్ బోర్డ్ చైర్మన్,రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరివాడని, భారత రాజ్యాంగాన్ని రూపొందించి బడుగు బలహీన వర్గాల కోసం ఎంతగానో పాటుపడిన వ్యక్తి జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం కొత్త ఆలోచనకు నాంది పడుతుందని, 189 యూనిట్ల రక్తాన్ని అంబేద్కర్ జయంతి సందర్భంగా సేకరించడం రాష్ట్రంలోనే మొదటిసారి అని అన్నారు. రక్తదానం చేసిన రక్త దాతలకు ప్రశంస పత్రాలను, హెల్మెట్ లను అందజేశారు. రక్తదానం చేసిన ఉపాధ్యాయులకు ప్రశంస పత్రాలను కామారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి రాజు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంగల వెంకటి, జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ నాయక్, ప్రధాన కార్యదర్శి సంగమేశ్వర్, ఐవిఎఫ్ రాష్ట్ర నాయకులు కట్ట రవి కుమార్, నరేష్, ఐవిఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎర్రం చంద్రశేఖర్, కామారెడ్డి రక్తదాతల సమూహా అధ్యక్షుడు జమీల్ హైమద్, ప్రధాన కార్యదర్శి దొంతి సుధాకర్, కోశాధికారి వెంకటేష్, సలహాదారులు శనిశెట్టి శ్రీనివాస్, యువజన విభాగం అధ్యక్షుడు ఎర్రం ఈశ్వర్, రక్తదాతల సమూహ ఉపాధ్యక్షులు డాక్టర్ వేద ప్రకాష్, పర్ష వెంకటరమణ, జాలిగామ శ్రీకాంత్, కొత్త బీమ్ రాజ్, రాజన్న రాజయ్య, వంశీకృష్ణ, కాంబ్లీ కిషన్ వంశీకృష్ణ, ఎంఈఓ లు ఎల్లయ్య, జోసఫ్, రాజు, అంబేద్కర్ సంఘాలు యువజన సంఘాలు పాల్గొన్నారు.

 

Children face difficulties during summer

More articles

Latest article