. . . టీఎన్ జీఓ జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
అన్ని రంగాలలో సమానత్వాన్ని పాటించినప్పుడే ఆ మహానుభావునికి ఘనమైన నివాళులని ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ అన్నారు. మంగళవారం భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని, నగరంలోని పులాంగ్ చౌరస్తా లో గల కాంస్య విగ్రహానికి టీఎన్ జీఓపక్షాన పూలమాలవేసి ఘనమైన నివాళులు అర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఈ మూడు ముఖ్య సూత్రాలే మన దేశ సర్వతోభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు. టీఎన్జీవో ఆధ్వర్యంలో కుల, మతాలకు అతీతంగా కార్యక్రమాలు చేపడుతూ, ఆ మహానుభావునికి ఆదర్శంగా ఉంటు, బాబాసాహెబ్ వారసులుగా కొనసాగుతూ, వారి ఆశయ సిద్ధికి పాటుపడతామని తెలియజేశారు. ఉద్యోగులకు, జిల్లా ప్రజలకు బాబాసాహెబ్ జన్మదిన శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం టీఎన్జీవో జిల్లా కార్యాలయం లో బాబా సాహెబ్ చిత్రపటానికి పూలమాలవేసి, ఘనమైన నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమాలలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, టీఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షులు గైని గంగారం, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా సహాధ్యక్షులు పెద్దోళ్ల నాగరాజు, ఉపాధ్యక్షులు జాఫర్ హుస్సేన్, టీఎన్జీవో అర్బన్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి, జిల్లా కార్యవర్గ సభ్యులు నిరంజన్ గౌడ్, స్వామి, టీఎన్జీవో ముఖ్య సలహాదారులు వనమాల సుధాకర్, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.
