25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

పరీక్షల్లో ఫెయిల్ అయితే లైఫ్ లేదా

Must read

📰 Generate e-Paper Clip

 

. . . మార్చి పోతే మే అడ్వాన్స్ సప్లీమెంటరీ లేదా ?

 

. . . క్షణికావేశంలో ప్రాణాలు తీసుకున్న ఆరుగురు విద్యార్ధులు

 

. . . ఇంటర్ ఫలితాల తరువాత కలవర పెట్టిన ఆత్మహత్యలు

 

హైదరాబాద్, బతుకమ్మ:

 

పరీక్షలలో ఫెయిల్ అయితే అర్ధాంతరంగా జీవితాన్ని ముగించాలా. ఒకటి, రెండు సబ్జేక్టులు ఫెయిల్ అయితే మళ్లీ లైఫ్ లేదా.. మార్చి పోతే సప్లీమెంటరీ పరీక్షలు ఉంటాయి కదా. అసలే అడ్వాన్స్ టెక్నాలజీ యుగంలో కనీసం విద్యా సంవత్సరం నష్ట పోవద్దని అడ్వాన్స్ సప్లిమెంటరి పరీక్షలు నిర్వహిస్తుంటే పరీక్షలలో తప్పామని ముక్కుపచ్చాలారని చిన్నారులు బలవన్మరణాలకు పాల్పడటం కలవర పెడుతుంది. పది, ఇంటర్ పరీక్షలలో తప్పినంత మాత్రాన జరిగే నష్టం లేదని సప్లీమెంటరీ రాసీ మంచి మార్కులతో గట్టేక్కవచ్చు. అసలే మార్కులకు వేయిటేజీ తీసివేసిన ఫలితాలే కొలమాణంగా చిన్నారులను ప్రాణాలు తీసుకోవడం తల్లిదండ్రులకు కూడా క్షోభకు గురి చేస్తుంది. అప్పుడే నవయవ్వనంలో( మైనార్టీ) తీరే సమయంలో మార్కుల కోసం తల్లిదండ్రులతో పాటు సమాజంలో జరుగుతున్న ఒత్తిడి వెరసీ పిల్లల ప్రాణాలను బలిగోరుతున్నాయి. చదువు రాకపోయిన ఎంతో మంది ఎన్నో రంగాలలో రాణించిన వారున్నారు. మార్చి పోతే సెప్టెంబర్( గతంలో) పాసై రాజ్యాలు ఏలినవారు ఉన్నారు. చదువు పై ఇష్టం లేకపోతే తనకు నచ్చిన దాంట్లో రాణించే అవకాశం ఉండగా చిన్నారులు ప్రాణాలు తీసుకోవడం పై సమాజం మీద ప్రబావం చూపుతుంది. టెక్నాలజీ పరంగా దుసుకుపోతున్న తరుణంలో యువరక్తం కోరి ఆయుష్షును తీసుకోవడం సరికాదు అంటున్నారు విద్యావేత్తలు.. మానసీక నిపుణులు..

 

If you fail the exams, you lose your life.

 

ఆదివారం వెలువడిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు పలు కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపాయి. రాష్ట్ర వ్యాప్తంగా రిజల్ట్ వచ్చిన కొన్ని గంటలలోనే 6 గురు విద్యార్ధులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొందరు ఫలితాలలో పలు సబ్జేక్ట్ లలో ఫెయిల్ అయ్యామని ప్రాణాలు తీసుకోంటే ఒక్కరిద్దరు ఎక్కడ పరీక్షల్లో ఫెయిల్ అవుతామో అనే భయంతో బలవన్మరణానికి పాల్పడ్డారు. రాష్ట్రంలో ఈ నెల 12న వెలువడిన ఇంటర్ ఫలితాలలో 75 శాతం మంది మాత్రమే పాస్ అయ్యారు. మిగతా వారు ఒకటి రెండు లేదా ముడు, నాలుగు సబ్జేక్ట్ లలో ఫెయిల్ అయ్యారు. ఫలితాల వెంటనే ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కుడా అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష తేదీలను ఖరారు చేసి ఫీజులు చెల్లించాలని ప్రకటించారు. 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభంకు ముందే అంటే మే 13 నుంచి సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించి ముందుగానే ఫలితాల వెలువరించేందుకు కూడా షెడ్యూల్ రిలిజ్ చేశారు. దానికి తోడు ఒకటి, రెండు మార్కులు తక్కువ వస్తే రివాల్యూయేషన్ ఉండనే ఉంది. కాని కొందరు విద్యార్ధులు క్షనికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో అయా కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపింది..

 

If you fail the exams, you lose your life.

 

ఈ నెల 12న ఫలితాలు వెలువడిన తరువాత మెదక్ జిల్లాకు చెందిన సాయిరాం(16) అదిలాబాద్ జిల్లాకు చెందిన జూలపల్లి సౌజన్య(17), మహభూబ్ నగర్ కు చెందిన జక్కుల శ్రావణి, సూర్యపేట జిల్లాకు చేందిన సౌజన్య(16), హైదరాబాద్ వారాసీ గుడాకు చెందిన కల్యాణి బేగం (16), రంగారెడ్డి జిల్లా దూసకల్ గ్రామానికి చెందిర అబి యాదవ్ లు ఒకటి, రెండు సబ్జేక్ట్ లలో ఫెయిల్ కావడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇదిలా ఉంటే ఖమ్మం జిల్లా కు చెందిన గంగదేవుల అక్షంత్ (17) అనే విద్యార్ధి ఫలితాలకు ముందే ఎక్కడ ఫెయిల్ అవుతాననే భయంతో రెండు రోజుల క్రితం రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అదివారం వచ్చిన రిజల్ట్ లో అక్షంత్ 347 ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ కావడంతో అతని తల్లిదండ్రులు కొడుకును తలుచుకుని కన్నిరు మున్నీరు అయ్యారు.

. . . ఈ రోజు ఫలితం ..రేపటి జీవితాన్ని నిర్ణయించదు : డా. బి. కేశవులు ఎండీ, సీనియర్ మానసిక వైద్య నిపుణులు

 

If you fail the exams, you lose your life.

 

ఇంటర్మీడియట్ ఫలితాల తర్వాత చోటుచేసుకున్న ఆత్మహత్యలు మనందరికీ గంభీర హెచ్చరిక. విద్యార్థులు చనిపోవడానికి కారణం ఫలితాలు కాదని, ఫలితాలకు మనం ఇచ్చిన అర్థం. విద్యార్థులకు ఇప్పుడున్న బాధ, నిరాశ, భయం ఇవి సహజమైనవి. కానీ ఇవి శాశ్వతం కావు. మెదడు ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇక అంతే అనే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంది. దయచేసి ఆ నిర్ణయాన్ని నిజం అనుకోకండి. ఒక పరీక్షలో విఫలమవడం అంటే మీ సామర్థ్యం విఫలమైంది కాదు. అది కేవలం ఒక పరిస్థితి మాత్రమే. ఆ ఒత్తిడి టైంలో తల్లిదండ్రులు, స్నేహితులు, టీచర్, లేదా డాక్టర్ సహాయం అడగడం బలహీనత కాదు అది మీ ధైర్యం. ముఖ్యంగా తల్లిదండ్రుల నెగెటివ్ రియాక్షన్ వారి మానసిక స్థితిని నిర్ణయిస్తుంది. పోలికలు, మందలింపులు, నిరాశ చూపడం ఇవి పిల్లలలో నిస్సహాయతను పెంచుతాయి. దాని బదులు ఆప్యాయం, అర్థం చేసుకోవడం, సమయం ఇవ్వడం చాలా అవసరం. వాళ్లు మార్కులు కాదు, వాళ్లు మనుషులు. ఫలితం ఒక పేజీ మాత్రమే, జీవితం మొత్తం పుస్తకం. దాన్ని ఒకే రోజు ముగించకండి.

If you fail the exams, you lose your life.

More articles

Latest article