24.7 C
Hyderabad
Monday, August 3, 2026

భక్తిశ్రద్ధలతో లక్ష్మినారాయణుని కళ్యాణం

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

భూలక్ష్మి మాత మందిరము లో భక్తిశ్రద్ధలతో లక్ష్మీనారాయణ కళ్యాణం నిర్వహించారు. నగరంలోని ముబారక్ నగర్ వి.వి నగర్ కాలనీలో గల భూలక్ష్మి మాత మందిరంలో లక్ష్మీనారాయణ కళ్యాణం ఆదివారం కన్నుల పండుగ గా నిర్వహించారు. భూలక్ష్మి మాత మందిరం 19వ వార్షికోత్సవంలో భాగంగా లక్ష్మీనారాయణ కళ్యాణం నిర్వహించామని ప్రతినిధులు తెలిపారు. ఉదయం 7 గంటలకు గోపూజ, సంకల్పం, కలశగణపతి పూజ, పుణ్యహ వాచనం, నవగ్రహ, క్షేత్ర పాలక, మాతక, వాస్తు మండల దేవతల ఆవాహనం, మండప అర్చన పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు ఆవాహిత దేవతల హోమాలు, బలి ప్రదానం, పూర్ణాహుతి, 10:30కు భూమి పూజ చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అర్చకులు కళ్యాణ్ శర్మ వేద పండితులు రాజశేఖర్ సాయి ఆధ్వర్యంలో కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సిబ్బంది భక్తులు తదితరులు పాల్గొన్నారు.

The auspiciousness of Lakshmi and Narayana with devotion

More articles

Latest article