భక్తిశ్రద్ధలతో లక్ష్మినారాయణుని కళ్యాణం

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   భూలక్ష్మి మాత మందిరము లో భక్తిశ్రద్ధలతో లక్ష్మీనారాయణ కళ్యాణం నిర్వహించారు. నగరంలోని ముబారక్ నగర్ వి.వి నగర్ కాలనీలో గల భూలక్ష్మి మాత మందిరంలో లక్ష్మీనారాయణ కళ్యాణం ఆదివారం కన్నుల పండుగ గా నిర్వహించారు. భూలక్ష్మి మాత మందిరం 19వ వార్షికోత్సవంలో భాగంగా లక్ష్మీనారాయణ కళ్యాణం నిర్వహించామని ప్రతినిధులు తెలిపారు. ఉదయం 7 గంటలకు గోపూజ, సంకల్పం, కలశగణపతి పూజ, పుణ్యహ వాచనం, నవగ్రహ, క్షేత్ర పాలక, మాతక, వాస్తు మండల దేవతల ఆవాహనం, మండప...