26.3 C
Hyderabad
Monday, August 3, 2026

గడిచిన రెండు వారాలలో 338 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య వెల్లడి

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అన్ని లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పి.ఎస్ లలో గడిచిన 2 వారాలలో 338 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదైనట్టు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ సమీపాలలో వారి వారి పోలీస్ స్టేషన్ పరిధిలలో వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ఇందులో భాగముగా మార్చి 30 నుండి ఏప్రిల్ 11 వరకు వాహన తనిఖీలు నిర్వహించగా ఇందులో మొత్తం 338 కేసుల నమోదు చేయడం జరిగిందన్నారు. పట్టు బడిన వారిని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ కోర్టులలో హాజరు పర్చగా 34 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించడం జరిగిందని, మిగిలిన వారికీ 25,75,000/- జరిమానా విధించారని తెలిపారు. అనంతరం సీపీ మాట్లాడుతూ ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వాహనాదారులు వాహనానికి సంబంధించినటువంటి పత్రములు సక్రమముగా తమ వద్ద ఉంచుకోగలరని, డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన వారి లైసెన్స్ 6 నెలల పాటు సస్పెండ్ చేయబడునని తెలిపారు. అలాగే మద్యం త్రాగి వాహనం నడిపి అనుకోని రోడ్డు ప్రమాదం జరిగినట్లయితే ఇన్సూరెన్సు లభించదని, మైనర్లు తాగి వాహనం నడిపి పోలీస్ వారికి దొరికినటైతే మైనర్, వెహికల్ ఓనర్ పైన ఛార్జ్ షీట్ నమోదు చేయబడునని, అలాగే జైలు శిక్ష విధించే అవకాశం కలదని పేర్కొన్నారు. ఒక సారి కంటే ఎక్కువ సార్లు పట్టుబడినట్లయితే జైలు శిక్ష విధించబడునని, మోటర్ వెహికల్ యాక్ట్ 1989 (చట్టం సవరణ – 2019) అమలులో ఉన్నందున డ్రంక్ అండ్ డ్రైవ్ లో మొదటిసారి పట్టుబడినట్లయితే 10,000/- జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష లేదా జరిమానా తో పాటు జైలు శిక్ష విధించబడునన్నారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ లో రెండోసారి పట్టుబడినట్లైతే 15,000/- జరిమానా లేదా జైలు శిక్ష లేదా జైలు శిక్షతో పాటు జరిమానా విధించబడునని తెలిపారు.

More articles

Latest article