26.6 C
Hyderabad
Monday, August 3, 2026

మహిళలకు విద్యను నేర్పించిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిబాపూలే

Must read

📰 Generate e-Paper Clip

 

. . . బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సుధాకర్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

సమాజం బాగుపడాలంటే మహిళా చైతన్యం ముఖ్యమని, మహిళా చైతన్యం విద్యతోనే సాధ్యమని గ్రహించి ఆ విధంగా మహిళలకు విద్యను నేర్పించిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిబాపూలే అని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సుధాకర్ అన్నారు. సామాజిక విప్లవ కారులు, సంఘ సంస్కర్త, బడుగులకు విద్య ప్రదాత, బీసీల జాతి పిత మహాత్మ జ్యోతిబాపూలే 200వ జయంతి సందర్భంగా శనివారం హనుమాన్ జంక్షన్, వినాయక్ నగర్ వద్ద గల పూలే విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబా పూలే కేవలం బడుగు బలహీనవర్గాలకె సేవ చేయలేదని గుర్తు చేశారు. సమాజంలో వెనుకబడిన ప్రతి ఒక్కరి గురించి పోరాడిన గొప్ప నాయకుడు మహాత్మ జ్యోతిబాపూలే అని పేర్కొన్నారు. తన భార్యకు విద్యను నేర్పి తన భార్యను భారత దేశ ప్రథమ ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దిన గొప్ప దార్శనికుడు మహాత్మ జ్యోతిబాపూలే అని అన్నారు. ఈ కార్యక్రమంలో నరాల సుధాకర్, బుస్స ఆంజనేయులు, కరిపే రవిందర్, దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, పోల్కం గంగాకిషన్, శ్రీలత, సత్య ప్రకాష్, చంద్రకాంత్, కోడూరు స్వామి, సాయిబసవ, నరసయ్య, బాలన్న, తోట రాజశేఖర్, లక్ష్మణ్ గౌడ్, వాసం జయ అపర్ణ రేఖ రుక్మిణి సత్యనారాయణ సురేందర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article