30.9 C
Hyderabad
Monday, August 3, 2026

జాతీయ బీసీ సంఘం ఆధ్వర్యంలో పూలే జయంతి వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం మహాత్మా జ్యోతిభా పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లోగల మహనీయుల పార్క్ వద్ద ఉన్న పూలే విగ్రహానికి సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా అధ్యక్షులు కెంపుల నాగరాజు నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీసీల ఐక్యతను చాటుతూ, పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని భారీగా నినాదాలు చేశారు. సామాజిక సమానత్వం కోసం పూలే చేసిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ పోతన్కర్ లక్ష్మీనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు సుజిత్ సింగ్ ఠాకూర్, ఎండల ప్రదీప్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు హనుమంత్జి రావు, జిల్లా ఉపాధ్యక్షులు గొపరి లక్ష్మణ్, లక్ష్మణ్ శివాజీ, చింతకాయల రాజు, శివ కుమార్ ముదిరాజ్ పాల్గొన్నారు. అలాగే జిల్లా కార్యదర్శులు పాక సురేష్, కృష్ణ ముదిరాజ్, టీడీపీ శివ, సుభాష్ పద్మ, నగర అధ్యక్షులు పుప్పాల రవి, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయ గౌడ్, కార్యదర్శులు భాస్కర్, వినోద్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నవాతే ప్రతాప్, కార్యదర్శి శేఖర్, బీసీ యువజన సంఘం నగర అధ్యక్షులు బట్టు సాయి ప్రసాద్, ఇతర సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొని పూలేకు ఘన నివాళులు అర్పించారు.

 

Phule Jayanti celebrations under the auspices of the National BC Association

More articles

Latest article