జాతీయ బీసీ సంఘం ఆధ్వర్యంలో పూలే జయంతి వేడుకలు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం మహాత్మా జ్యోతిభా పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లోగల మహనీయుల పార్క్ వద్ద ఉన్న పూలే విగ్రహానికి సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా అధ్యక్షులు కెంపుల నాగరాజు నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీసీల ఐక్యతను చాటుతూ, పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని భారీగా నినాదాలు చేశారు. సామాజిక సమానత్వం కోసం పూలే చేసిన...