కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు రామేశ్వరపల్లి డబుల్ బెడ్ రూం అధ్యక్షులుగా తోకల శ్రీనివాస్ ను శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శులుగా షేక్ షాదుల్లా, రామగుల్ల శంకర్, కట్కూరి రామకృష్ణ, ఎర్రోళ్ల మారుతి, ఉపాధ్యక్షులుగా సంగి శ్యామ్, తోకల అనిల్ కుమార్, సింగల్ వార్ బాలాజీ, గూడెపు బాల్ నర్సు, కోశాధికారులుగా గంజి దామోదర్, శ్యామ్, సలహాదారులుగా బోదాస్ పెద్ద రాజయ్య, తెడ్డురవి, వడ్ల లక్ష్మయ్య, మంగళ కిషన్, లింగం, షేక్ అహ్మద్, ఈశ్వర్, పాషా, మోచకిరణ్, చంద్రంలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ మా మీద నమ్మకంతో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు రామేశ్వరపల్లి డబుల్ బెడ్ రూమ్ వార్డు సభ్యులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. వార్డు సభ్యులకు ఏ సమస్య వచ్చిన తమ వంతు బాధ్యతగా పనిచేస్తామని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యులు, డబుల్ బెడ్ రూం వార్డు సభ్యులు పాల్గొన్నారు.

