27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ సేవలు అభినందనీయం

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

బాన్సువాడ నియోజకవర్గంలో బిజెపి నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ చేస్తున్న సేవలు అభినందనీయమని పలువురు ప్రశంసిస్తున్నారు. రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన కొనపత్రి గజానన్ ఇటీవల అకాలంగా మరణించడం జరిగింది. వారి కుటుంబ సభ్యుల ఆర్ధిక పరిస్థితి బాగాలేదని స్థానిక బిజెపి నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న బాన్సువాడ నియోజకవర్గం బిజెపి నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ తనవంతు సహాయంగా గురువారం వారి కుటుంబ సభ్యులకు 5,000 రూపాయలు ఆర్థిక సహయం అందించడం జరిగింది. వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, రుద్రూర్ మండల అధ్యక్షుడు ఆలపాటి హరికృష్ణ, ఉపాధ్యక్షులు కృష్ణంరాజు, ప్రధాన కార్యదర్శి ఏముల గజేందర్, గణేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article