27.5 C
Hyderabad
Friday, July 31, 2026

అవగాహన ఉన్నపుడే హెచ్ఐవీ బారిన పడకుండా ఉంటారు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఎయిడ్స్ నియంత్రణ పై అవగాహన ర్యాలీలో అదనపు కలెక్టర్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రతి ఒక్కరికి హెచ్ఐవి పైన అవగాహన ఉన్నప్పుడే దాని బారిన పడకుండా ఉండగలరని జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో 99 రోజుల ఆరోగ్య మిషన్ ఆరోగ్య వారోత్సవంలో భాగంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆవరణలో ఎయిడ్స్ అవెర్ నెస్ వాకతాన్ (రెడ్ వాక్) ను నిర్వహించారు. ఈ ర్యాలీని అదనపు జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ తో కలిసి జండా ఊపి ప్రారంభించారు. ఈ వాకతాన్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుండి గాంధీ చౌక్ మీదుగా తిరిగి జనరల్ హాస్పిటల్ కి చేరుకుంది. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.బి రాజశ్రీ జిజి హెచ్ లో గల సంపూర్ణ సురక్ష కేంద్రం వద్ద రోగ నిర్ధారణ పరీక్షల క్లినిక్ ను, మైత్రి క్లినిక్ వద్ద ట్రాన్స్ జెండర్స్ కోసం రోగ నిర్ధారణ పరీక్షల కేంద్రం ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జలగం తిరుపతి రావు, నోడల్ ఆఫీసర్ ఎఆర్టీ సెంటర్, జిల్లా టిబి నియంత్రణ అధికారి డాక్టర్ దేవి నాగేశ్వరి, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ అశ్విని, ఎన్విహెచ్సీపీ డాక్టర్ వెంకటేష్, డీఈ డాక్టర్ శ్రావ్య, టిబి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అవంతి, ఎఆర్టీ సెంటర్ మెడికల్ ఆఫీసర్స్, డి హెచ్ ఈ ఘనపురం వెంకటేశ్వర్లు, డీపీఎం సుధాకర్, స్నేహ సొసైటీ సిద్దయ్య, పీఎమ్ఓ రూప, మోయిజ్, నవీన్, రవి గౌడ్ జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సిబ్బంది, జిల్లా వైద్య శాఖ కార్యాలయం సిబ్బంది, ఆఫీసర్ క్లబ్ సభ్యులు, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సిబ్బంది, టిబి కంట్రోల్ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నారు.

More articles

Latest article