. . . పీడీఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
విద్యాశాఖ అనుమతి లేకుండా నిజామాబాద్ లో, బర్దిపూర్ లో ఏర్పాటు చేసిన నారాయణ విద్యా సంస్థల ఫ్లెక్సీలను తొలగించాలని పీడీఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నారు. ఈ విషయమై పిడిఎస్ యూ ఆధ్వర్యంలో గురువారం న్యుడాలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యాశాఖ నుండి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా అక్రమ పద్ధతిలో అడ్మిషన్స్ చేపడుతూ నారాయణ విద్యాసంస్థల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని వాటిని వెంటనే తొలగించాలని, తప్పుడు ప్రచారంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మోసపోయే అవకాశం ఉందని అన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా అనుమతులు లేవని స్పష్టం చేశారని, విద్యాశాఖ నుంచి అనుమతులు వచ్చేవరకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని, సంబంధిత విద్యా సంస్థకు నోటీసులు జారీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ నగర అధ్యక్షులు సిర్రం పవన్ కుమార్, నాయకులు మనోజ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
