26.6 C
Hyderabad
Monday, August 3, 2026

కంజర సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ చేపట్టాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . అదనపు కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన పీడీఎస్ యు నాయకులు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

పీఎంశ్రీ కంజర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం నిధుల దుర్వినియోగానికి పాల్పడుతూ, విద్యార్థుల వద్ద నుండి ఫైన్ ల పేరుతో అక్రమ వసూళ్లు చేస్తున్న ప్రిన్సిపాల్ విజయలలిత పై సమగ్ర దర్యాప్తు జరపాలని, నిధులను రికవరీ చేయాలని, ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని పీడీఎస్ యు నాయకులు డిమాండ్ చేశారు. ఈ విషయమై జిల్లా అదనపు కలెక్టర్ కి గురువారం పీడీఎస్ యు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా పీడీఎస్ యు అధ్యక్షులు కర్క గణేష్, ప్రధాన కార్యదర్శి ఎల్.అనిల్ లు మాట్లాడుతూ కంజర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అక్కడి ప్రిన్సిపాల్ విజయలలిత ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ప్రతినెల తప్పుడు మెస్ బిల్లులు, మెయింటెనెన్స్ బిల్లులతో నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. ముఖ్యంగా పీఎంశ్రీ ద్వారా వస్తున్న లక్షలాది రూపాయల నిధులను తప్పుడు బిల్లులు పెట్టి పక్కదారి పట్టిస్తున్నారన్నారు. అంతేకాకుండా అడుగడుగునా విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేస్తూ ఫైన్ ల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. ఎవరైనా విద్యార్థులు ఫైన్ ల విషయం బయటకు చెబితే, విచారణకు వచ్చిన అధికారులతో మాట్లాడినా వారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ, వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి అడ్మిషన్ క్యాన్సల్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారనీ అన్నారు. ఇప్పటికైనా కంజర గురుకులంలో జరుగుతున్న పీఎంశ్రీ పథకం నిధుల దుర్వినియోగం, మెస్ బిల్లులు, మెయింటెనెన్స్ బిల్లుల నిధుల దుర్వినియోగం, విద్యార్థుల నుండి అక్రమ వసూళ్లపై సమగ్ర దర్యాప్తు జరపాలని, ప్రిన్సిపాల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు జి. నితిన్, జిల్లా నాయకులు ఎం.మున్నా, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article