బతుకమ్మ, ఆర్మూర్ : దేవి నవరాత్రుల శుభ సందర్భంగా పైడి రాకేష్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అర్ముర్ పట్టణం లోని అమ్మవారికి పట్టు చీరలను సమర్పించారు, ఇట్టి కార్యక్రమం ఆర్మూర్ ఎమ్మెల్యే పార్టీ కార్యాలయం లో పైడి రాకేష్ రెడ్డి ఫౌండేషన్ డైరెక్టర్ పైడి సుచరిత చేతుల మీదుగా అమ్మ వారి మండపాల ప్రతినిధులకు పట్టు చీరలను అందచేశారు. ఇట్టి కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగొట గంగాధర్, బీజేపీ ప్రధాన కార్యదర్శులు పోల్కం వేణు, పులి యుగేందర్, బీజేపీ కార్యదర్శి చిన్నరెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు పాన్ శ్రీనివాస్,బీజేపీ మహిళా ప్రతినిధులు స్వభావిక గౌడ్, బొచకర్ సునీత, బీజేపీ నాయకులు & మండపాల ప్రతినిధులు పాల్గొన్నారు.
