24 C
Hyderabad
Sunday, August 2, 2026

బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నిజామాబాద్ కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

కమిటీలోని సభ్యులందరూ తమకు కేటాయించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని, తక్షణమే మీకు ఇచ్చిన బాధ్యతలను చేపట్టాలని నిజామాబాద్ కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో సోమవారం నిజామాబాద్ కార్పొరేషన్ డిసిసి అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. అందులో భాగంగా ఉపాధ్యక్షులను బ్లాక్ ఇంచార్జ్ లుగా, ప్రధాన కార్యదర్శులను డివిజన్ ఇంచార్జ్ లుగా, కార్యదర్శులను ప్రధాన కార్యదర్శులకు కో ఇంచార్జ్ లుగా నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ్యులు తమకు కేటాయించిన బాధ్యతలతో డివిజన్ అధ్యక్షులను, డివిజన్ కమిటీలను, బూత్ ఏజెంట్లను, బూత్ కమిటీలను, సోషల్ మీడియా కో ఆర్డినేటర్లను నియమించాలని అన్నారు. ఇప్పడి నుండి ప్రతి డివిజన్ లో జరిగే ఏ కార్యక్రమమైన ఇంచార్జ్ ల పర్యవేక్షణలో జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి నిజామాబాద్ కార్పొరేషన్ కార్యవర్గ కమిటీలోని ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

More articles

Latest article