26.6 C
Hyderabad
Monday, August 3, 2026

కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . టీయుసీఐ ఆలిండియా ఉపాధ్యక్షులు వనమాల కృష్ణ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

కార్పొరేట్ కంపెనీల యాజమాన్యాలకు ఊడిగం చేసేలా, కార్మికుల హక్కులను, చట్టాలను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం 29 చట్టాలను 4 లేబర్ కోడ్ లుగా మార్పు చేసిందని, ఈ చట్టాలను వెంటనే రద్దు చేయాలని టీయుసీఐ ఆలిండియా ఉపాధ్యక్షులు వనమాల కృష్ణ అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్ లను వ్యతిరేకిస్తూ, తెలంగాణలో వాటి అమలును నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చౌక్ వద్ద 4 లేబర్ కోడ్ ల ప్రతులను దగ్ధం చేశారు.

 

Four anti-labor labor codes should be repealed

 

ఈ సందర్భంగా కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ లు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను ఏప్రిల్ ఒకటి నుండి అమలు చేయబోతుందన్నారు. ఈ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టియుసిఐ జిల్లా ఉపాధ్యక్షులు రాజేశ్వర్ జిల్లా నాయకులు సాయరెడ్డి, కిరణ్, రవి, గంగాధర్, ఏఐపీకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు కే.గంగాధర్, ఒడ్డెన్న, నసీర్, సాయిబాబా, టియుసిఐ నాయకు లు విజయ్ కుమార్, శాంతి కుమార్, అమూల్య, పద్మ, గంగాధర్, లక్ష్మణ్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article