30.9 C
Hyderabad
Monday, August 3, 2026

పశువులకు ఉచిత గాలికుంటు టీకాల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

 

మాక్లూర్, బతుకమ్మ :

 

మాక్లూర్ మండలంలోని చిక్లీ గ్రామంలో పశువైద్య, పశుసంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో ఆవులకు, గేదెలకు జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం మండల పశువైద్యాధికారిణి డాక్టర్ ఉమామ సహర్ గ్రామ సర్పంచ్ భూమన్న ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ ఈ టీకాలు తప్పకుండా వినియోగించుకోవాలని, లేనిచో పశువులు ఈ వ్యాధి బారిన పడి అధిక జ్వరం తో మేత మేయకుండా, నీరసంగా ఉండి తద్వారా పునరుత్పత్తి తగ్గి తీవ్రంగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందన్నారు. సకాలంలో ఈ టీకాలు వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. అలాగే వేసవి కాలంలో పశువులను మేతకు ఉదయము, సాయంత్రము మాత్రమే తీసుకెళ్లాలని, పశువులకు తగినంత త్రాగునీరు అందించడం, నీడ, గాలి ప్రసరణ కలిగిన ప్రదేశంలో ఉంచడం, వేడి ఒత్తిడిని తగ్గించేందుకు సమయానికి ఆహారం ఇవ్వడం, పశువుల కొట్టాలలో పరిశుభ్రత పాటించడం వంటి ముఖ్య సూచనలను, అలాగే శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూమన్న, ఉప సర్పంచ్ సతీష్, మండల పశువైద్య సిబ్బంది టి. వినీత వీఎల్వో, అహ్మద్ పాషా వీఏ, రవి సికిందర్, గోపాలమిత్రులు సుధీర్, పశువుల పెంపకం దారులు పాల్గొన్నారు.

More articles

Latest article