. . . అటవీ శాఖకు అప్పగింత
రాజంపేట, బతుకమ్మ
రాజంపేట మండల పరిధిలోని కుమ్మరి కుంట వద్ద రెండు జింక పిల్లలను స్థానికులు పట్టుకున్న ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన పుట్ట నర్సింలు, చింతల నర్సింలు ఈ జింక పిల్లలను గుర్తించి పట్టుకున్నారు. సమాచారం అందుకున్న రాజంపేట హెడ్ కానిస్టేబుల్ కె. రమేష్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ అటవీ జంతువులను రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. అనంతరం జింక పిల్లలను అటవీ శాఖ అధికారిణి ప్రమీల చేతికి అప్పగించారు. ఈ కార్యక్రమంలో బీట్ అధికారులు దీపిక, సురేష్ పాల్గొన్నారు.
