కుమ్మరి కుంటలో జింక పిల్లలు పట్టివేత
. . . అటవీ శాఖకు అప్పగింత రాజంపేట, బతుకమ్మ రాజంపేట మండల పరిధిలోని కుమ్మరి కుంట వద్ద రెండు జింక పిల్లలను స్థానికులు పట్టుకున్న ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన పుట్ట నర్సింలు, చింతల నర్సింలు ఈ జింక పిల్లలను గుర్తించి పట్టుకున్నారు. సమాచారం అందుకున్న రాజంపేట హెడ్ కానిస్టేబుల్ కె. రమేష్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ అటవీ జంతువులను రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని...