29.7 C
Hyderabad

అర్సపల్లి అర్బన్ హెల్త్ సెంటర్ ను ఆకస్మిక తనిఖీ చేసిన డీఎంహెచ్ ఓ

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సీటీ, బతుకమ్మ:

నిజామాబాద్ నగరంలోని అర్సపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో  అందిస్తున్న ఆరోగ్య సేవలు, టీ హబ్ శాంపుల్స్ సేకరణను, రిజిస్టర్ల ను, వివిధ ప్రోగ్రాంలలో జాబితాలను ఆన్లైన్లో నమోదు చేయు విధానాన్ని, ఈ డీడీ క్యాలెండర్సు, రిజిస్టర్స్ ,ఓపి ఐపి రిజిస్టర్ లను పరిశీలించారు. ఈ సంధర్బంగా అక్కడ అధికారులు సిబ్బందిని గర్భిణీ స్త్రీల సేవలు, మాతా శిశు ఆరోగ్య సేవలపై అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రతిరోజు సమయపాలన పాటిస్తూ విధులకు సక్రమంగా హాజరు కావాలని, విధి నిర్వహణలో ఎటువంటి జ్ఞాపకం చేయరాదని, వివిధ కార్యక్రమాలకు అనుగుణంగా ఆరోగ్య కేంద్రానికి కేటాయించిన లక్ష్యాలను, ఏఎన్ఎం మరియుఆశా కార్యకర్తల వారీగా  వందశాతం పూర్తి చేయాలన్నారు. ప్రతిరోజు జీవన శైల వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేసి ఎమ్ ఓ లాగిన్ కు పంపగా ,వైద్యాధికారి స్క్రీనింగ్ చేసి ఎంఓ లాగిన్ లో నమోదు చేయాలన్నారు, అవసరమైన వారిని ఉన్నత సేవలకై జి జి హెచ్ కు రిఫర్  చేయాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని డాక్టర్ నవ్య ,వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article