అర్సపల్లి అర్బన్ హెల్త్ సెంటర్ ను ఆకస్మిక తనిఖీ చేసిన డీఎంహెచ్ ఓ
నిజామాబాద్ సీటీ, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని అర్సపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న ఆరోగ్య సేవలు, టీ హబ్ శాంపుల్స్ సేకరణను, రిజిస్టర్ల ను, వివిధ ప్రోగ్రాంలలో జాబితాలను ఆన్లైన్లో నమోదు చేయు విధానాన్ని, ఈ డీడీ క్యాలెండర్సు, రిజిస్టర్స్ ,ఓపి ఐపి రిజిస్టర్ లను పరిశీలించారు. ఈ సంధర్బంగా అక్కడ అధికారులు సిబ్బందిని గర్భిణీ స్త్రీల సేవలు, మాతా శిశు ఆరోగ్య...