. . . పిసిసి డెలిగేట్ సభ్యులు విట్టల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ బిచ్కుంద మండల అధ్యక్షుడు దర్పల్ గంగాధర్
బిచ్కుంద, బతుకమ్మ :
బిఆర్ఎస్ పార్టీ అంటేనే దోచుకుని దాచుకునే పార్టీ అని గత పదేళ్ల పాలన అంతా కమిషన్ల పాలన అని పిసిసి డెలిగేట్ సభ్యులు విట్టల్ రెడ్డి ,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ధర్పల్ గంగాధర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పట్ల ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే బిఆర్ఎస్ పార్టీ నాయకులు తమ నాయకుడైన తోట లక్ష్మీ కాంతారావు పై వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. గత బిఆర్ఎస్ పాలనలో ఒక్క పేదవానికి ఇల్లు, రేషన్ కార్డులు ఇవ్వలేదని, అలాంటివారు మా నాయకుడైన తోట లక్ష్మీకాంతరావు పై వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి నెలల కాలంలోనే మహిళలకు ఉచిత బస్సు, పేదలకు ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని తెలిపారు. ప్రతి పేదవాడి కడుపు నింపేందుకు సన్న బియ్యం పంపిణీ, ఉచిత విద్యుత్తు, గ్యాస్ సిలిండర్ పై సబ్సిడీ ఇచ్చి పేదల కళ్ళల్లో ఆనందం నింపిన ఘనత కాంగ్రెస్ పార్టీది అన్నారు. ఓట్ల కోసం రాజకీయం చేసేది బిఆర్ఎస్ పార్టీ మాత్రమేనని, ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. గత బిఆర్ఎస్ పాలనలో డబల్ బెడ్ రూంలు, ఇతర సంక్షేమ పథకాలను పక్క నియోజకవర్గానికి తరలించిన విషయం ప్రజలెవరు ఇంకా మర్చిపోలేదని వారు చురకలు అంటించారు. జుక్కల్ నియోజకవర్గం లో ప్రజలు మెచ్చిన ప్రజా పాలన నడుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ్నాథ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సీమ గంగారం, ఫ్రెండ్ సెట్, ధర్పల్లి సంతోష్, సాయిని అశోక్ తదితరులు పాల్గొన్నారు.
