28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

దాబాలలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలోని దాబా హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో మంగళవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు సునీత, నవిత లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఆయా దాబా హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు వెళ్లి అక్కడి ఆహార పదార్థాలను పరిశీలించారు. కుళ్లిన, పాడైపోయిన ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో విక్రయించరాదని, కిచెన్ అనునిత్యం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, నిషేధిత జాబితాలో ఉన్న ఫుడ్ తయారీ పదార్థాలను వినియోగించవద్దని నిర్వాహకులకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

More articles

Latest article