24.7 C
Hyderabad
Monday, August 3, 2026

తెలంగాణ వర్సిటీ బోటనీ విభాగంలో బి. లింగరాజుకు డాక్టరేట్

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బోటనీ విభాగంలో బి. లింగరాజుకు సోమవారం పిహెచ్.డి. డాక్టరేట్ ప్రదానం చేయబడింది. ఆచార్య బి.విద్యవర్ధిని పర్యవేక్షణలో బి. లింగరాజు “సోలానం జాన్ పోకర్తం యొక్క పెరుగుదల, దిగుబడిపై బ్రాసీనో స్టెరాయిడ్స్, సాలిసిలిక్ యాసిడ్ ప్రభావం” అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథాన్ని తెలంగాణ విశ్వవిద్యాలయానికి సమర్పించారు. అందుకు గాను సోమవారం సైన్స్ కళాశాల సెమినార్ హాలులో ఈ సిద్ధాంత గ్రంథంపై (వైవా వోస్) మౌఖిక పరీక్ష నిర్వహింపబడింది. ఈ మౌఖిక పరీక్షకు ఎక్స్ టర్నల్ ఎగ్జామినర్ గా ఉస్మానియా విశ్వవిద్యాలయం బోటనీ విభాగం ఆచార్య ఎస్.సీతారాం రావు  విచ్చేసి సిద్ధాంత గ్రంథాలపై పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ఆ సమాధానాలకు ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పిహెచ్.డి. (వైవావోస్) మౌఖిక పరీక్ష కు బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్ పర్సన్ ప్రొఫెసర్ ఎం అరుణ, బోటనీ విభాగపతి డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్ అలీమ్ ఖాన్ సైన్స్ డీన్, కంట్రోలర్ ఆచార్య కె. సంపత్ కుమార్, కాంట్రాక్ట్ అధ్యాపకులు డాక్టర్ డి.శ్రీనివాస్, వి. జలంధర్ తదితర విభాగాల అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

More articles

Latest article