తెలంగాణ వర్సిటీ బోటనీ విభాగంలో బి. లింగరాజుకు డాక్టరేట్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బోటనీ విభాగంలో బి. లింగరాజుకు సోమవారం పిహెచ్.డి. డాక్టరేట్ ప్రదానం చేయబడింది. ఆచార్య బి.విద్యవర్ధిని పర్యవేక్షణలో బి. లింగరాజు "సోలానం జాన్ పోకర్తం యొక్క పెరుగుదల, దిగుబడిపై బ్రాసీనో స్టెరాయిడ్స్, సాలిసిలిక్ యాసిడ్ ప్రభావం" అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథాన్ని తెలంగాణ విశ్వవిద్యాలయానికి సమర్పించారు. అందుకు గాను సోమవారం సైన్స్ కళాశాల సెమినార్ హాలులో ఈ సిద్ధాంత గ్రంథంపై (వైవా వోస్) మౌఖిక పరీక్ష నిర్వహింపబడింది. ఈ మౌఖిక పరీక్షకు...