25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

అవినీతికి పాల్పడిన తండ్రి కొడుకుల పై చర్యలు తీసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . టిసిఎస్ అధ్యక్షులు శంకర్ గౌడ్ డిమాండ్   

 

కోటగిరి, బతుకమ్మ :

 

కోటగిరి కల్లు గీత సహకార సంఘం సొసైటిలో గత రెండు సంవత్సరాలుగా లెక్కలు చెప్పకుండా ఏక చక్రాధిపత్యం వహిస్తూ అవినీతికి పాల్పడుతున్న తండ్రి కొడుకులు అయినా డిపో మేనేజ్మెంట్ సాయగౌడ్, కోశాధికారి శ్రీధర్ గౌడ్ లపై వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని టిసిఎస్ అధ్యక్షులు శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలోని ఏఎస్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 60 కల్లుగీత కార్మికుల జీవనాధారంగా ఉన్న కల్లుగీత సహకార సంఘంలో గత రెండు సంవత్సరాల నుండి కోటగిరి డిపో మేనేజ్మెంట్ గా డి.సాయ గౌడ్, క్యాషియర్ గా డి.శ్రీధర్ గౌడ్ కొనసాగుతున్న తండ్రి కొడుకులు ఏక చక్రాధిపత్యం వహిస్తూ సహకార సంఘానికి సంబందించిన ఎలాంటి జమ, ఖర్చులు లెక్కలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తూ లక్షల రూపాయలు దోచుకొని దాచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షేర్ పార్ట్ నర్ లకు లెక్కలు చెప్పకుండా అడిగిన వారిపై దౌర్జన్యం చేస్తూ ఇటు గీత కార్మికులను, అటు సొసైటీ సభ్యులను విభజించి పాలిస్తున్నారన్నారు. కల్లు సొసైటీ ని తమ చేతిలోకి తీసుకొని ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తూ అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ రాజ్యమేలుతున్నారన్నారు. నష్టాలు, లాభాలు చూపించకుండా, సొసైటీ సభ్యులకు డబ్బులు పంచకుండా రోజువారీగా వచ్చిన డబ్బులతో విలాసమైన జీవితాలు గడుపుతున్న తండ్రి కొడుకుల పై అధికారులు వెంటనే చట్టరీత్యా చర్య తీసుకోవాలని ఈ విషయంపై జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ కు సైతం లిఖితపూర్వంగా ఫిర్యాదు చేస్తామని ఆయనన్నారు. ఈ రోజు నుంచి కోటగిరి గీత పరిశ్రమ సహకార సంఘం గ్రూపు సొసైటీ పాలకవర్గం ద్వారా కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు ఏ.విఠల్ గౌడ్, టిసిఎస్ ఉపాధ్యక్షులు ఆర్.అరుణ్ కుమార్ గౌడ్, కార్యదర్శి ఎస్.సాయి బాబా గౌడ్, గౌడ సంఘం నాయకులు ఆర్.శ్యామ్ సుందర్ గౌడ్, ఆర్.రమేష్ గౌడ్, ఏం.నాగ గౌడ్, ఎస్.శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

More articles

Latest article