. . . కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరిన కమిటీ సభ్యులు
బోధన్, బతుకమ్మ :
బోధన్ పట్టణంలో ఈ నెల 29 న భారీ హిందూ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించనున్నట్టు హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహణ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణపై ఆదివారం సమావేశం నిర్వహించి గోడ ప్రతులను ఆవిష్కరించారు. పట్టణంలోని చక్రేశ్వర శివాలయం ఆవరణలో సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుందని, కార్యక్రమంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గీత యజ్ఞం ట్రస్ట్ వ్యవస్థాపకులు విశ్వక తీర్థ స్వామి హాజరుకానుండగా, వక్తగా తెలంగాణ ప్రాంత ప్రచారక్ లింగం శ్రీధర్ పాల్గొననున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా రాజేశ్వరరావు, గౌరవాధ్యక్షులుగా అజయ్ వడియార్ వ్యవహరిస్తున్నారన్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి బోధన్ పట్టణంలోని ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
