25.4 C
Hyderabad

అనుభవం ఉన్నవారికే హౌస్ లిస్టింగ్ సర్వే విధులను కేటాయించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . పీఆర్ టీయు తెలంగాణ జిల్లా అధ్యక్షుడు కృపాల్ సింగ్ సోడి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

రాబోయే హౌస్ లిస్టింగ్ సర్వే విధులను అనుభవం ఉన్న ఉపాధ్యాయులను అప్పగించిన పక్షంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా సక్రమంగా సమర్థవంతంగా సర్వే నిర్వహణ సాధ్యమవుతుందని పీఆర్ టీయు తెలంగాణ జిల్లా అధ్యక్షుడు కృపాల్ సింగ్ సోడి అన్నారు. భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు 2026 మే 11 నుండి జూన్ 9 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న హౌస్ లిస్టింగ్ సర్వే (మొదటి విడత) విధులను, 2024 అక్టోబర్ లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల జనన సర్వే కార్యక్రమాన్ని అతి తక్కువ సమయంలో ఎలాంటి లోపాలు లేకుండా విజయవంతంగా నిర్వహించిన ఉపాధ్యాయులకే ప్రాధాన్యంగా కేటాయించవలసిందిగా ఆయన కోరారు. ఈ ఉపాధ్యాయులు తమ స్థానిక పరిధిలోనే కులగణన కార్యక్రమాన్ని నిర్వహించినందున ఆయా గ్రామాల సామాజిక, భౌగోళిక పరిస్థితులపై సంపూర్ణ అవగాహన కలిగి ఉన్నారన్నారు.  కావున సామాజిక-ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే నిర్వహించిన ఉపాధ్యాయులకే హౌస్ లిస్టింగ్ సర్వే విధులను కేటాయించాలని పీఆర్ టీయు తెలంగాణ జిల్లా అధ్యక్షుడు కృపాల్ సింగ్ సోడి కోరారు.

More articles

Latest article