29 C
Hyderabad
Monday, August 3, 2026

ఈ బడ్జెట్ ప్రజా, రైతు వ్యతిరేకం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . గ్యారంటీల పేరుతో ప్రజలనే మోసం చేసిన బడ్జెట్

 

. . . బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రజా వ్యతిరేకం, రైతు వ్యతిరేకం, యువత వ్యతిరేకమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పలేట్ కులాచారి అన్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్యారంటీల పేరుతో అధికారంలో కి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పడు ఆ ఆరు గ్యారంటీలను విస్మరించిన దగా కోరు బడ్జెట్ ను ప్రవేశపెట్టిందని విమర్శించారు. ఈ బడ్జెట్ పేదలను నిరాశలోకి నెట్టెసిందని అన్నారు. గల్ఫ్ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, గల్ఫ్ లో మరణించిన కార్మికుల కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందిస్తామని ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోలేదని విమర్శించారు. బడ్జెట్ లో గల్ఫ్ బాధితులకు ఎలాంటి కేటాయింపులు లేకపోవడం ద్రోహమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పుడు విమర్శలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇప్పుడు మూత పడ్డ చక్కెర కర్మాగారాలను పున: ప్రారంభించడానికి కేవలం రూ.300 కోట్లు కూడా కేటాయించలేదని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఆరు నెలల్లో చక్కెన ఫ్యాక్టరీలను తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చి, ప్రస్తుత బడ్జెట్ లో దానికి ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం జిల్లా రైతాంగాన్ని మోసం చేయడమేనని అన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి రూ.1500 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. ఉస్మానియా యూనివర్సిటీ కి రూ.1000 కోట్లు ప్రతి పాదించిన ప్రభుత్వం, నిజామాబాద్ లోని తెలంగాణ యునివర్సిటీ అభివృద్ధిని పూర్తిగా విస్మయించిందని విమర్శించారు. అలాగే ఆదిలాబాద్ విమానాశ్రయం గురించి ప్రస్తావించిన ప్రభుత్వం, సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న జక్రాన్ పల్లి విమానాశ్రయాన్ని పట్టించుకోలేదని అన్నారు. ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్ట్ ప్యాకేజిలు 21,22 పనులకు, మంచిప్ప రిజర్వాయర్ కు కూడా నిధులు కేటాయించకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తొందన్నారు. ఇటీవల నిజామాబాద్ పర్యటనలో రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చినప్పటికీ, తాజా బడ్జెట్ లో దాని ప్రస్తావన లేకపోవడం నిరాశ కలిగించిదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర పిలుపు మేరకు ఈ నెల 23న ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పొతన్ కార్ లక్ష్మి నారాయణ, ఓం సింగ్ నాయక్, పుట్ట రవీందర్, బొబ్బిలి వేణు, ఇందూర్ సుధా, గడ్డం రాజు, అంబదాస్ రావు, ఆనంద్, విజయ్ కృష్ణ, బుల్లెట్ శీను తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article