26.6 C
Hyderabad
Monday, August 3, 2026

పాటిమిది ఆభయ ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడిగా చింతకుంట రాకేష్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

బిబిపేట మండలం మాందాపూర్ గ్రామంలో శనివారం పాటిమిది ఆభయ ఆంజనేయ స్వామివారి ఆలయంలో నూతన కార్యవర్గం ఎన్నిక కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆలయ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా చింతకుంట రాకేష్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా కమ్మరి రంజిత్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా యాచం నరేందర్, కోశాధికారిగా గంగోళ్ల నరేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. అదే విధంగా డైరెక్టర్ లుగా శీలం శేఖర్ రెడ్డి, చింతర్ల శేషారెడ్డి, అనుపాటి మోహన్ రెడ్డి, పందిరి రాజు, నక్క రవి, గొల్ల పెంటయ్య, గజ్వెల్లి నర్సింలు, అంకన్నగారి శ్రీనివాస్ గౌడ్, దాసరి గణేష్, గొర్రె రవి ఎన్నికయ్యారు. ఈ కమిటీకి గౌరవ అధ్యక్షుడిగా చింతకుంట రాజిరెడ్డి (రాఘవులు కుమారుడు)ని గ్రామ ప్రజలు, వివిధ కులసంఘాల పెద్దల సమక్షంలో ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమం గ్రామ ప్రజల సమక్షంలో ఉత్సాహంగా సాగింది.

More articles

Latest article