25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

సమాజ నిర్మాణం కోసం పోరాటం కొనసాగుతుంది

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఆర్ఎస్పీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కన్వీనర్ కటారి రాములు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఆర్‌ఎస్‌పి పార్టీ లక్ష్యం సామాజిక న్యాయం, సమానత్వం సాధించడమేనని, శ్రామిక వర్గం ఆధిపత్యంలో సమాజ నిర్మాణం కోసం పోరాటం కొనసాగుతుందని ఆర్ఎస్పీ జిల్లా కన్వీనర్ కటారి రాములు అన్నారు. జిల్లా కేంద్రంలోని నాందేవ్ వాడలో గల రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ (ఆర్ఎస్పీ) పార్టీ కార్యాలయం లో గురువారం పార్టీ 86వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్పీ జిల్లా కన్వీనర్ కటారి రాములు అధ్యక్షత వహించగా, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బొడ అనిల్ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1940 మార్చి 19 న స్థాపించబడిన ఆర్ఎస్పీ పార్టీ స్వాతంత్ర్య ఉద్యమంలో పుట్టిన విప్లవాత్మక శక్తిగా దేశంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో సామాజిక, ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయని, నిరుద్యోగం, ధరల పెరుగుదల, ప్రజాస్వామ్య హక్కుల హననం వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కార్మికులు, రైతులు, విద్యార్థులు, యువత ఐక్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అలాగే దేశంలో మత, భాష, సంస్కృతి పేరుతో ప్రజలను విభజించే శక్తులను ఎదుర్కోవాలంటే వామపక్ష పార్టీలు, లౌకిక భావజాల సంస్థలు ఐక్యంగా పోరాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పిట్ల నరేష్, గోపాల్, సిహెచ్.పండరి, టి.కృష్ణ, మహమ్మద్ నిజాముద్దీన్, సయ్యద్ ఇర్ఫాన్,  హైమద్, బాబా ఖాన్, నాని, విక్రమ్ గౌడ్, సునిల్, రాహుల్, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

The struggle for community building continues

More articles

Latest article