28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

వ్యక్తిత్వ నిర్మాణానికి ఎన్.సి.సి ఎంతో ఉపయోగపడుతుంది

Must read

📰 Generate e-Paper Clip

 

. . .  తెలంగాణ ఎన్.సి.సి బెటాలియన్ ఏ.ఓ లెఫ్టినెంట్ కల్నల్ విష్టు పి నాయర్

 

. . .  గిరిరాజ్ కళాశాలలో ఎన్.సి.సి వేడుకలు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

బాధ్యతాయుతమైన నాయకులుగా ఎదగడానికి, వ్యక్తిత్వ నిర్మాణానికి ఎన్.సి.సి ఎంతో ఉపయోగపడుతుందని తెలంగాణ ఎన్.సి.సి బెటాలియన్ ఏ.ఓ లెఫ్టినెంట్ కల్నల్ విష్టు పి.నాయర్ అన్నారు. నగరంలోని గిరిరాజ్ కళాశాలలో బుధవారం ఎన్.సి.సి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పి. రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన 12 తెలంగాణ ఎన్.సి.సి. బెటాలియన్ ఏ.ఓ. లెఫ్టినెంట్ కల్నల్ విష్ణు పి.నాయర్, సుబేదార్ మేజర్ రాచ్ పాల్ సింగ్, లెఫ్టినెంట్ డాక్టర్ రామస్వామి లతో కలిసి వేడుకలను ప్రారంభించారు.

 

NCC is very useful for personality development.
NCC is very useful for personality development.

 

ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ కళాశాల క్యాడెట్లు దేశ స్థాయిలో గుర్తింపు పొందడం ఆనందంగా ఉందని, మంచి శిక్షణనిస్తున్న ఎన్.సి.సి అధికారి రామస్వామిని అభినందించారు. రిపబ్లిక్ డే పరేడ్ క్యాంపు ఢిల్లీ 2026 లో పాల్గొన్న ఎస్. దేవీదాస్, సికింద్రాబాద్ లో పాల్గొన్న ఎన్. వెంకుల్, ఈ.నరేశ్, అస్సాంలో మారథాన్ లో 2వ స్థానంలో నిలిచిన బి.శ్రీకాంత్, 5వ స్థానంలో నిలిచిన అమర్ సింగ్, 7వ స్థానంలో నిలిచిన సి.జ్యోతి లను ప్రత్యేకంగా సన్మానించారు.

 

NCC is very useful for personality development.

 

అనంతరం లెఫ్టినెంట్ కల్నల్ మాట్లాడుతూ క్యాడెట్స్ ఎన్.సి.సి.తో పాటు అకాడమిక్ మెరిట్ తెచ్చుకోవాలన్నారు. యూనిఫామ్ ఉద్యోగాలతో సమాజానికి అవసరమైన అన్ని ఉన్నత స్థానాలలో మీరు ఉండాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలు అందరిని అలరించాయి. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్  ప్రొఫెసర్ రంగరత్నం, ఎన్.సి.సి. ఆఫీసర్ లెఫ్టైనెంట్ డాక్టర్ రామస్వామి, పి.ఆర్.వో. దండు స్వామి,  ఏ.ఓ. రామ్ కిషన్, సూపరిండెంట్ ఉదయభాస్కర్, వినయ్ కుమార్, రంజిత, రమేశ్ గౌడ్, తదితర అధ్యాపకులు, ఎన్.సి.సి. క్యాడెట్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

More articles

Latest article