24 C
Hyderabad
Sunday, August 2, 2026

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట కార్మికుల ధర్నా 

Must read

📰 Generate e-Paper Clip

 

.  .  . మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ ఎదుట బైఠాయించిన  కార్మికులు

 

. . . పరిస్థితి ఉద్రిక్తం . . . ఆపస్మారక స్థితిలోకి వెళ్లిన మహిళ కార్మికులు 

 

.  .  . ఆసుపత్రికి తరలించిన పోలీసులు 

 

 నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : 

 

మున్సిపల్ కార్మికుల వేతనాలు చెల్లించాలంటూ సిపిఐ సిపిఎం, ఎటియుసి ఆధ్వర్యంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట చేపట్టిన ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. మున్సిపల్ కమిషనర్ చాంబర్ ఎదుట కార్మికులు బైఠాయించి సుమారు అరగంటసేపు నిరసన తెలిపారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఆందోళన కారులను అక్కడి నుంచి వదిలి వెళ్లాలని కోరారు. దీంతో కార్మికులు అంతా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం మెట్లపై కూర్చుని తమ డిమాండ్లు నెరవేరే వరకు ఇక్కడ నుండి కదలమని భీష్ముంచుకో కూర్చున్నారు. డిప్యూటీ కమిషనర్ ను కలిసి తమ సమస్యను విన్నవించడానికి వెళ్లిన మహిళా కార్మికులు అక్కడ ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులకు మహిళా కార్మికులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో ముగ్గురు మహిళలు అపస్మారక స్థితికి చేరుకొని పడిపోయారు.అపస్మారక స్థితికి చేరుకున్న మహిళలను 108 అంబులెన్స్ వాహనంలో చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో కోపోద్రిక్తులైన మున్సిపల్ కార్మికులు రెండు నెలలుగా తమకు వేతనాలు అందడం లేదని అలాగే ప్రభుత్వం నుండి తమకు రా వాల్సిన దుస్తులు, చెప్పులు కూడా ఇవ్వడం లేదని ఉన్నవారిని తీసివేస్తామని అవసరం ఉన్న వారిని వీధుల్లో ఉంచుతామని ప్రభుత్వం ఇటీవల చెప్పడంతో ఆందోళనకు గురయ్యారు. వీలైనంత త్వరగా తమ ఆందోళన పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. 

Workers' protest in front of Nizamabad Municipal Corporation

More articles

Latest article