24 C
Hyderabad
Sunday, August 2, 2026

బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించాలి

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ: అధికారికంగా నిర్వహించనున్న బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. బతుకమ్మ వేడుకల నిర్వహణపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఆయా శాఖల అధికారులతో సమావేశమై చర్చించారు. మండల, జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న బతుకమ్ వేడుకల్లో మహిళలను పెద్ద సంఖ్యలో పాల్గొనే విధంగా చూడాలని, పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. మహిళా సంఘాల సభ్యులను వేడుకల్లో భాగస్వాములను చేయాలన్నారు. సద్దుల బతుకమ్మ వేడుకను పెద్ద ఎత్తున నిర్వహించాలని అన్నారు. చెరువులు, కుంటలు తదితర నీటి వనరుల ప్రాంతాల్లో గజ ఈత గాళ్లను నియమించాలని సూచించారు. బతుకమ్మ ఆడే ప్రాంతాల్లో శానిటేషన్ పనులు, విద్యుత్ లైట్ లను, షామియానా తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. తెలంగాణ సాంస్కృతిక కళాకారులను బతుకమ్మ వేడుకల్లో పాల్గొని విధంగా ఏర్పాట్లు చేయాలని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో రంగనాథ్ రావు, డీఎస్పీ నాగేశ్వర్ రావు, జిల్లా సంక్షేమ అధికారి బావన్న, జిల్లా ప్రణాళిక అధికారి రాజారాం, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, మున్సిపల్ కమిషనర్ సుజాత,ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

జల్ శక్తి అభియాన్ పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్..

Bathukamma celebrations should be held grandly

జిల్లాలో జలాశక్తి అభియాన్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను పరిశీలించేందుకు కేంద్ర పవర్ మినిస్ట్రీ డిప్యూటీ సెక్రటరీ బెంజమెన్ కరుణాకరన్ జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటిస్తున్నట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. జిల్లాలో జలశక్తి  కార్యక్రమం క్రింద వివిధ శాఖల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలపై  మంగళవారం రోజున కలెక్టరేట్  సమావేశ మందిరంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంబంధిత అధికారులు వివరించారు. గ్రామీణాభివృద్ధి, గ్రౌండ్ వాటర్, అటవీ, నీటి పారుదల, వ్యవసాయం, ఉద్యానవనం శాఖల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను ఆయా శాఖాధికారులు వివరించారు. 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో చేపడుతున్న కార్యక్రమాల గురించి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్ వివరించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త ఆచార్య శ్రీకృష్ణ పవార్,  అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి,  జిల్లా అటవీ అధికారిని నిఖిత, జడ్పీ సీఈవో చందర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, జిల్లా ఇరిగేషన్ అధికారి శ్రీనివాస్, జిల్లా ఉద్యాన అధికారిని జ్యోతి, గ్రౌండ్ వాటర్ అధికారి సతీష్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

More articles

Latest article